
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ కరోనా నుంచి 993 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,203 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.