
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం కోసం భారత్- జర్మనీ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారతూ ఉత్కంఠ రేపుతోంది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ ఐదో గోల్ చేసి 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్ కు పాయింట్ అందించాడు.