
భారత మహిళా రెట్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఫ్రిక్వార్టర్స్ లో ఆమె స్వీడన్ కు చెందిన మ్యాట్ సన్ సోఫియాను 7-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చలాయించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్ లో 2,2,1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్ లో 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్ధి 1 పాయింట్ సాధించింది.