
వెంకటేశ్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. జూలై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నారప్ప స్ట్రీమింగ్ కానుంది.