టాలీవుడ్ ను కేసీఆర్ సర్కార్ ఆదుకుంటుందా?

కరోనాతో అన్నింటికంటే నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అదీ సినిమా రంగమే.. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ దాకా కేసులు పెరిగిన ప్రతీసారి లాక్ డౌన్ తో సినీ ఇండస్ట్రీ సంవత్సరన్నర కాలంగా అస్సలు నడవడం లేదు. థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు ఆగిపోయి నానా అగచాట్లు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీ వందల కోట్లు నష్టపోయింది. లాక్ డౌన్ ఎత్తేసిన కూడా ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేని దుస్థితి. ఓపెన్ చేసినా జనాలు వస్తారో రారో […]

Written By: NARESH, Updated On : July 8, 2021 4:25 pm
Follow us on

కరోనాతో అన్నింటికంటే నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అదీ సినిమా రంగమే.. మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ దాకా కేసులు పెరిగిన ప్రతీసారి లాక్ డౌన్ తో సినీ ఇండస్ట్రీ సంవత్సరన్నర కాలంగా అస్సలు నడవడం లేదు. థియేటర్లు మూతపడి.. షూటింగ్ లు ఆగిపోయి నానా అగచాట్లు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీ వందల కోట్లు నష్టపోయింది. లాక్ డౌన్ ఎత్తేసిన కూడా ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేని దుస్థితి. ఓపెన్ చేసినా జనాలు వస్తారో రారో నన్న భయంతో ఇండస్ట్రీ స్తబ్దుగా ఉంటోంది.

ప్రస్తుతం ఓటీటీలదే హవా నడుస్తోంది. దీంతో థియేటర్లు, సినీ ఇండస్ట్రీకి లాభాలు లేక మరింత కృంగిపోతోంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో థియేటర్ వ్యవస్థను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ తాజాగా వేడుకుంది. అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. జీవోనంబర్ 75ని వెనక్కి తీసుకోవాలని చాంబర్ కోరుతోంది. ఈ జీవో ప్రకారం పార్కింగ్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులపై అదనపు భారాన్ని తగ్గించింది.

ఇప్పటికే థియేటర్ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యిందని.. పార్కింగ్ చార్జీలను వసూలు చేసుకునే అవకాశాన్ని తిరిగి తమకు కల్పించాలని .. అదో ముఖ్యమైన ఆదాయ వనరు అని థియేటర్లు కోరుతున్నాయి.

కరోనాతో కుదేలైన సినిమా పరిశ్రమను ఆదుకోవడానికి కనీస కరెంట్ చార్జీలను మినహాయించాలని.. ఖాళీగా ఉన్న థియేటర్లకు అవి పెనుభారం అవుతున్నాయని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేడుకుంది. ఇక ప్రాపర్టీ టాక్స్ నుంచి కూడా మినహాయించాలని.. మరో రెండేళ్ల వరకూ జీఎస్టీ మినహాయింపు ఇఛ్చి థియేటర్ వ్యవస్థను ఆదుకోవాలని కోరింది.

అయితే ఇప్పటికే ఆర్తిక భారంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యవహారంతో నడిచే సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? లేదా అన్నది సందేహంగా మారింది.