
ఐటీ చట్టం సెక్షన్ 66 కింద ఏపీలో పోలీసు కేసుల నమోదు ఆపాలని ఎంపీ రఘురామ కోరారు. నవ సూచనల పేరుతో సీఎం జగన్ కు లేఖ రాస్తున్న ఎంపీ ఇవాళ రాసిన లేఖలో సెక్షన్ 66ఏ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకలాపాలపై ఈ చట్టం ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని 2015 లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినా పోలీసులు అదే సెక్షన్ పై కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు.