KCR Mogilayya: తెలంగాణ సీఎం కేసీఆర్ ‘భోళా శంకరుడి’ టైపు అంటారు.. ఆవేశం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా తట్టేకోలేరు అంటారు. ఆయన చూపు వరం.. కోపం శాపం.. ఇలాంటి సినిమా డైలాగులన్నీ ఇప్పుడు కేసీఆర్ కు అప్లై చేస్తూ కేసీఆర్ ను పొగిడేస్తున్నారు. ఇన్నాళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక.. అష్టకష్టాల్లో తెలంగాణ కళాకారుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక్క దెబ్బతో అతడి కష్టాలన్నీ దూరమైపోయాయి.
ఎక్కడో నాగర్ కర్నూల్ జిల్లాలో సంప్రదాయ కళను బతికిస్తూ ‘మొగిలయ్య’ జీవిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని మురికివాడలో చాలీచాలని సంపాదనతో బతుకు జీవుడా అంటూ బతుకీడిస్తున్నాడు. కానీ ఒక్క ‘పద్మ శ్రీ’ అవార్డు మొగిలయ్య జీవితాన్ని మార్చేసింది.
శభాస్ భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాటను పాడిన మొగిలయ్య వాయిస్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ మొగిలయ్య ఎవరు ఏంటి అనే విషయం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ పాటను మొగిలయ్యతో పాటు రామ్ అనే వ్యక్తి కూడా పాడారు. కానీ ఈ పాటతో మొగిలయ్య ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ మొగిలయ్య ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయానికి వస్తే…
మొగిలయ్య నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల ప్రాంతంలో జన్మించారు. ఇతను ఏడు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు. ఈ వాయిద్యాన్ని మొగిలయ్య తన తాత తండ్రుల నుంచి వారసత్వంగా తీసుకున్నారు. 7 మెట్ల కిన్నెర వాయిద్యం కాస్తా 12 మెట్లుగా తీర్చిదిద్దారు మొగులయ్య. ఎంతో ప్రసిద్ధి చెందిన జానపద కళలలో కిన్నెర మెట్ల ఎంతో ప్రసిద్ధి చెందినదని చెప్పవచ్చు. ఈ వాయిద్యంతో ఎన్నో ప్రదర్శనలు చేసిన మొగిలయ్య ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇతని ప్రదర్శన చూసిన తెలంగాణ ప్రభుత్వం అతనికి సన్మానం చేసింది. అదేవిధంగా ఇతని జీవిత కథను తెలంగాణ 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో కూడా చేర్చారు.
ఇలా మొగిలయ్య కిన్నెర మెట్ల ప్రదర్శనను ఇతరులకు నేర్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని ఒక అద్భుతమైన కళ అంతరించిపోతుందని ఈ కళను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలంటూ వేడుకున్నారు. ఇలా కిన్నెర మెట్ల వాయిద్యంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య పై పవన్ కళ్యాణ్ దృష్టి పడింది. ఈ క్రమంలోనే అతనిని పిలిపించి భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ లో ఇతని గొంతును వినిపించారు.ఇలా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో కిన్నెర మెట్లను వాయిస్తూ మొగిలయ్య పాడిన ఈ పాట తెలంగాణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే ఈ పాటను విడుదల చేసిన కొన్ని గంటలకే కొన్ని మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించుకొని అద్భుతమైన రికార్డును సృష్టించిందని చెప్పవచ్చు.
తెలంగాణ కళాకారుడికి పద్మశ్రీ అవార్డు రావడంతో కేసీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మొగిలయ్యను ప్రగతి భవన్ కు పిలిచి మరీ సన్మానించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని, తెలంగాణ, తెలంగాణ కళలకు, సంస్కృతికి గుర్తింపు తెచ్చారని కేసీఆర్ కొనియాడారు. మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం తరపున కోటి రూపాయల నగదు బహుమతిని కేసీఆర్ ప్రకటించారు. మొగిలయ్యకు హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని మురికివాడలో షెడ్లాంటి ఇంట్లో నివసిస్తున్న మొగిలయ్యకు మంచి ఇంటిని నిర్మించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రతినెలా పింఛను కూడా చెల్లిస్తుంది. మొగిలయ్య -అతని కుటుంబ సభ్యులు గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన పేదరికం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పద్మశ్రీ అవార్డు గెలుచుకోవడంతో అతడి దరిద్రం మొత్తం కేసీఆర్ కరుణతో వదిలిపోయింది. ఇక నుంచి కష్టాలన్నీ తీరి మొగిలయ్య ప్రశాంతంగా ఉండనున్నాడు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Kcr gives rs 1 crore plot in hyd to bheemla nayak mogilaiah
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com