HomeతెలంగాణBRS Party : అందుకే బీఆర్ఎస్ రెబల్స్ ను కేసీఆర్ వదిలేశాడట.. అసలు సీక్రెట్ బయటపడింది..

BRS Party : అందుకే బీఆర్ఎస్ రెబల్స్ ను కేసీఆర్ వదిలేశాడట.. అసలు సీక్రెట్ బయటపడింది..

BRS Party :  పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కోసం చేసే పోరాటంలో బీఆర్ఎస్ స్పీడ్ తగ్గించింది. ఆ ఎమ్మెల్యేపై వేటు కోసం బలంగా పట్టుపట్టవద్దని మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలకి సూచించారని పార్టీ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. మొన్నటివరకు అనర్హత వేటు వేసేంతవరకు ఉపేక్షించేదిలేదని ప్రతినబూనిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావులు కేసీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ టాపిక్ పై స్లో అయినట్లు తెలుస్తోంది.

■ ఇప్పుడే ఉప ఎన్నికలొస్తే పార్టీ గెలవడం కష్టమని కేసీఆర్ కి నివేదికలు:
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి జంపనైన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తక్షణం ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ గెలవదనే నివేదికలు కేసీఆర్ కి చేరాయి. కేసీఆర్ స్వయంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్వే జరిపించి ఈ నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పై జనాల్లో ఇంకా మోజు తీరలేదని ,ఇప్పుడు ఉప ఎన్నికలొస్తే పార్టీ ధీటుగా ఎదుర్కోలేదనే నిర్ధారణకు వచ్చిన కేసీఆర్ ఆ మేరకు అనర్హత వేటు విషయంలో కొంత నిదానంగా వ్యవహరించాలని సూచించారని తెలుస్తోంది.

■ కాంగ్రెస్ మరింత చెడితేనే కలిసోస్తుందనేది బీఆర్ఎస్ స్ట్రాటజీ:
రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేకపోవడం, ఆరు గ్యారంటీల అమలు సరిగ్గా లేకపోవడంతోపాటు తాజాగా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ ల పేరుతో చేస్తున్న దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ , సీయం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ సఖ్యత లేదని, మంతత్రుల వైఖరిపై కూడా జిల్లాల్లో అసంతృప్తి మొదలైందని బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేల్లో తేలింది. ఈ వ్యతిరేకత ఉప ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ కి సరిపోదని , కాంగ్రెస్ చెడిపోవడం మొదలైందని, అది మరింతగా చెడిపోవాలని, ఈలోగా తమ పార్టీని బలోపేతం చేద్దామని అప్పటివరకు వేచివుందామని కేసీఆర్ పార్టీ నేతలకి సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మరింత చెడ్డ తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకి పట్టుబడితే , ఎన్నికలొచ్చినా విజయం సాధిస్తామనే స్ట్రాటజీని కేసీఆర్ ఫాలో అవుతున్నారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular