KA Paul KCR: తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారంటే దానివెనుక తెలంగాణ అమరవీరుల త్యాగాలు ఎన్నో ఉన్నాయి. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 1200 మంది అమరుల్లో కేవలం 500 మందికే న్యాయం చేశారని.. కొంతమందికే ఉద్యోగాలిచ్చారన్న పేరుంది. మిగతా వారిని పరిగణలోకి తీసుకోలేదంటారు. ఇప్పుడు కేసీఆర్ పట్టించుకోని తెలంగాణ అమరులనే అస్త్రంగా చేసుకొని పోరాడాలని కేఏ పాల్ బయటకు వస్తున్నారు.
తెలంగాణలో కేసీఆర్ పెడచెవిన పెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది ఉద్యోగాలు, యువతను పట్టించుకోకపోవడం.. ఆ తర్వాత తెలంగాణ అమరులకు న్యాయం జరగలేదని.. వారందరి కుటుంబాలను ఆదుకోలేదని.. ఉద్యమకారులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు, ఉద్యోగాలు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు అదే అస్త్రంతో కేసీఆర్ పై విరుచుకుపడడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ రెడీ అయిపోయారు.
Also Read: Senior Actress Jayasudha: ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయిన సీనియర్ నటి జయసుధ
తెలంగాణలో పర్యటించి టీఆర్ఎస్ కార్యకర్త చేతుల్లో చెంప దెబ్బ తిన్న కేఏ పాల్ ఇక ఈ రాష్ట్రంలో కేసీఆర్ అంతు చూసే వరకూ వదలి పెట్టనని నాడు శపథం చేశారు. అన్నట్టే ఫైట్ షురూ చేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ అండదండలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవలే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి కేఏ పాల్ ఆ తర్వాత తెలంగాణలో యాక్టివ్ కావడం.. తెలంగాణ అమరుల ఎజెండాను టేకప్ చేయడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. కేసీఆర్ దెబ్బ తీసేందుకు బీజేపీ అన్ని శక్తులు, యుక్తులు ఉపయోగిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కేఏ పాల్ ను దించినట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేఏ పాల్ తెలంగాణ అమరుల ఎజెండాను ఎత్తుకున్నారు. వారికి న్యాయం చేయడం.. ఆర్థిక సాయం చేయడం.. ఆదుకోవడం.. ప్రజాశాంతి పార్టీ తరుఫున టికెట్లు ఇచ్చి నిలబెట్టడం వరకూ అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్ దెబ్బతీసే లక్ష్యంతోనే పాల్ దీన్ని తెరపైకి తెచ్చినట్టు అర్థమవుతోంది.
-ఇంతకీ కేఏ పాల్ ఎత్తుకున్న ఎజెండా ఏంటి? ఆయన ప్లాన్ ఏంటి? ప్రణాళికలు ఏంటన్నవి ‘కేఏ పాల్ మాటల్లోనే’ తెలుసుకుందాం… తాజాగా మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. అవిప్పుడు తెలంగాణ సమాజంలో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..?
‘‘త్యాగాలు వీరివి, భోగాలు మీవా ?నేడు మీరు రాజభోగాలు అనుభవిస్తుంది వీరి త్యాగాల ఫలితంగా కాదా?’’
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే అనేది నిర్వివాదాంశం. తెలంగాణ రాష్ట్రసాధనలో అమరుల పాత్ర అజరామరమైనది.
-అటువంటి వీరిని నిర్లక్ష్యం చేయటం తగునా? తెలంగాణ రాష్ట్ర సాధన లో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ? అటువంటి అమరుల కుటుంబాలు, నేడు రోడ్డున పడ్డాయి.
-నిజమైన తెలంగాణవాదులు, నిజమైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు నేడు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు.
-చేతికి అందివచ్చిన బిడ్డలను కోల్పోయి, గుర్తింపుకు నోచుకోక, పేదరికంతో, ప్రభుత్వ సాయం అందక, ఎంతో దీనావస్థలో ఉన్నాయి.
-వారి కుటుంబాల పరిస్థితి విని, చూసి, నా హృదయం చలించిపోయింది, వాళ్ల కుటుంబాల పరిస్థితిని చూసి అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయి, వారి ఆత్మఘోష ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగిలి తీరుతుంది. ఇవే ఈ ప్రభుత్వానికి చివరి రోజులు
-రాజభోగాలు మత్తులో ఉన్న మీకు, వారి ఆర్తనాదాలు వినిపించడం లేదు, గత 8 సంవత్సరాల పాలనలో మీరు తెలంగాణ ఉద్యమకారులకు చేసింది శూన్యం?
-పన్నెండు వందల అమరుల కుటుంబాల్లో 546 మందికి మందిని గుర్తించారు. వాళ్లలో కూడా రెండు వందల నలభై మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
-ఏంటి ఈ అహంకారం, నీ ఒక్కడి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది? సకల జనుల సమ్మె మొదలుకుని తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపింది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల స్ఫూర్తి కాదా ?
-రాష్ట్రంలో కనీసం గుర్తింపుకి నోచుకోని ఉద్యమకారులు ఎందరున్నారు? కనీస గుర్తింపు కొరకు ఎందరో వేచి చూస్తున్నారు. అమరులను గుర్తించడానికి కూడా మీకు చేతకాలేదు.
-ఇంకా ఆత్మత్యాగానికి సిద్ధపడి, ఆత్మహత్య యత్నంలో భాగంగా తమ అవయవాలతో పాటు సర్వస్వాన్ని కోల్పోయి దివ్యాంగులుగా మిగిలిపోయిన 300 మంది కుటుంబాలకు మీరేం చేశారు ?
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుండి మద్దతు తెలిపిన నేను, వీరికి అండగా నిలుస్తాను.
-ప్రజాశాంతి పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకై పోరాటం చేస్తాం, పోరాడి సాధించుకుంటాం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం.
-తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామ్.
-వీరి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నామ్
-ఈ పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలనే కాకుండా, ఆత్మహత్యలకు సిద్ధమై దివ్యాంగులుగా మారిన 300 మందితో పాటు, ప్రతి ఒక్క ఉద్యమకారుడుని గుర్తించి పూర్తిస్థాయిలో ఆదుకుంటాం
-ప్రజాశాంతి పార్టీ తరఫున 20 శాతం అసెంబ్లీ టికెట్లు అమరుల కుటుంబసభ్యులకు కేటాయిస్తామ్, ఉద్యమకారులకు మరో 10 శాతం టికెట్లు కేటాయిస్తామ్.
-రానున్న మన ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు హైదరాబాదులో జర్నలిస్ట్ కాలనీ తరహా కాలనీ నిర్మిస్తాం.
-ఉద్యమకారులపై ప్రభుత్వం బనాయించిన బూటకపు కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం
-ఈ కేసుల ఆధారంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడుని గుర్తించి తగిన గౌరవ వేతనాన్ని అందిస్తాం.
-అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా, అమరవీరుల విగ్రహాలుతో కూడిన పార్కులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తాం.
-అమరవీరుల తల్లిదండ్రులకు పింఛన్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య ప్రభుత్వం తరఫున అందిస్తాం
-ఈ పదిహేను వందల కుటుంబాలలో ఇంటికొక ఉద్యోగం ఇస్తాం. వారి వారి గ్రామాలలో సేద్యానికి అనువైన ఐదెకరాల భూమిని కేటాయిస్తాం.
-వీరి బిడ్డల త్యాగాలవల్ల సిద్ధించిన తెలంగాణ వీరే పాలించు కుంటారు. వీరికి రాజ్యాధికారాన్ని అందించే దిశగా ప్రజాశాంతి పార్టీ కృషి చేస్తోంది, ప్రజలే వీరికి రాజ్యాన్ని రాజ్యాధికారం ఇస్తారు
-రేపు ఉదయం 9 గంటలకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ఈ వందమంది తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము
-మీడియా వారు లైవ్ కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
Also Read:TDP Mahanadu 2022 Success: మహానాడు సక్సెస్ వెనుక జగన్..అదేలా అంటే?
Recommended Videos:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ka paul getting ready to fight on kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com