KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రాలేదని అలిగిన కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. కానీ, ఏడాదికే ఆయన పార్టీని వీడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్యమించారు. ఈ క్రమంలో ఆయనతో అనేక మంది కలిసి నడిచారు. పోరాటాలు చేశారు. పార్టీ స్థాపించిన ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని గుర్తించి పోరాటంతోపాటు, చర్చలు.. మద్దతు కూడగట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాలు కలిసి ఏకతాటిపైకి వచ్చాయి. సకల జనుల పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సిదిధంచింది. ఇక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికట్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. అధికారం చేపట్టారు. 2018లోనూ ప్రజలు గులాబీ పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్ర సాధనుద్యమ స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమంలోనూ కేసీఆర్ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా కేసీఆర్ పాలన ఒక చరిత్ర అని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రమే అయినా అభివృద్ధిలో పాత రాష్ట్రాలకు దీటుగా పనుల చేశారు. సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మించారు. విద్యుత్ సమస్య పరిష్కరించారు. నీళ్లు, నిధుల విషయంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
2023లో ఘోర ఓటమి..
ఇదిలా ఉంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు. ఇందుకు కారణం ఆయన అహంకారమే. రాష్ట్ర ం అభివృద్ధి అయిందని, ఇకదేశాన్ని అభివృద్ధి చేస్తానని పార్టీ పేరు మార్చడం. తెలంగాణ అంశాన్నిపక్కన పెట్టడంతోపాటు నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తించాడు. కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, కూతురు కవిత తాము ఎంత చెబితే అంత అన్న భావనకు వచ్చారు. ఇది ప్రజల్లో గులాబీ నేతలపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీనిని గుర్తించిన నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రజలను కాంగ్రెస్‌వైపు మరల్చడంలో సక్సెస్ అయ్యారు. పార్టీని గెలిపించారు. అధికారంలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. దీంతో ఇటీవలే సంబరాలు కూడా చేసుకున్నారు.
ప్రజల మదిలో..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ముద్ర చెరిపివేయాలని చూస్తోంది. ఈ క్రమంలో అనేక చర్యలు చేపడుతోంది. కేసీఆర్ ప్రారంభించిన పథకాలు నిలిపివేసింది, తెలంగాణ తల్లి విగ్రహానిన మార్చింది. తెలంగాణ పేరులో టీఎస్‌ను తొలగించి టీజీగా చేర్చింది. ఇంకా అనేక మార్పులకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమతమయ్యాడు. ఏడాదిగా ఆయన బయటకు రావడం లేదు. కానీ, ప్రజలు మాత్రం ఇప్పటికీ కేసీఆర్‌ను మర్చిపోలేదు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఇక ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలన కారణంగానే ఆరు గ్యారంటీల అమలులో జాప్యం పగరుగుతోందని సీఎం కూడా ఆరోపించారు. అయితే ప్రజలు మాత్రం తెలంగాణను అభివృద్ధి చేసిన వ్యక్తిగా కేసీఆర్‌నే తలుచుకుంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: People consider kcr as the person who developed telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com