NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా గాయపడినట్లు సమాచారం. తన కుడిచేతికి బలమైన దెబ్బ తాకినట్లు తెలుస్తోంది. కుడి చేతి వేలికి గాయం కావడం వల్ల నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొద్ది రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. నెల రోజుల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రానున్న సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
కాగా, దీపావళి పండుగరోజు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన కుమారులతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు తారక్. ఈ ఫొటోలో తారక్ కుడి చేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. ఈ విషయం గమనించిన అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. మరోవైపు, రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌తో కలిసి ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. పీరియాడికల్ కథా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, నటి ఆలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తుండగా.. డీవివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఇటీవల విడుదలైన గ్లింప్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Jr ntr got surgery for his right hand due to miner accident at gym workouts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com