Hari Vamsh Singh Rathore: సినిమాల్లో చూపించినట్టుగానే గత కొంతకాలంగా మన దేశంలో కొంత మంది ప్రజాప్రతినిధుల ఇంట్లో భారీగా డబ్బు, నగదు, బాండ్లు లభ్యమవుతున్నాయి. ఆ మధ్య జార్ఖండ్ రాష్ట్రంలో హోం మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ(income tax department) సోదాలు (Rides) చేసింది.. ఆ సమయంలో అతని వద్ద భారీగా నగదు, బంగారం లభ్యమయింది.. దీంతో అధికారులకు దిమ్మతిరిగినంత పని అయింది.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హరి వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు(income tax department officers) సోదాలు జరిపారు. అలా సోదాలకు వెళ్లిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్కడి దృశ్యాలు చూసి వారికి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. అక్కడ బంగారం చూస్తే కేజీఎఫ్(KGF) గోల్డ్ మైన్ కనిపించింది. నగదును చూస్తే.. ఆర్బీఐ మింట్ కాంపౌండ్ దర్శనమిచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో నిలువలు ఉన్నాయి కాబట్టి.. బంగారం, కట్టల కొద్ది నగదు, వాహనాలు మాత్రమే కాదు అక్కడ ఉన్న మూడు మొసళ్ళను చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
గత ఆదివారం నుంచి..
గత ఆదివారం నుంచి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇతడితో పాటు మాజీ కౌన్సిలర్ రాజేష్ కేసర్వాణి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సుమారు 155 కోట్ల రూపాయల పన్నును బిజెపి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఎగవేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు కోట్ల నదులతో పాటు బంగారం, వెండిని అధికారులు స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. బంగారం, వెండి విలువ కోట్లలో ఉంటుందట.
బీడీ వ్యాపారం
మాజీ ఎమ్మెల్యే రాథోడ్, కేశర్వాణి ఇద్దరూ బీడీల వ్యాపారం చేసేవారు. ఇందులో కేశర్వాణి 140 కోట్ల వరకు పన్ను ఎగవేశారట. అయితే దానికి సంబంధించిన దస్త్రాలను సోదాల సమయంలో ఐటీ అధికారులు గుర్తించారు. మరోవైపు కేశర్వాణి స్థిరాస్తి వ్యాపారంలో కూడా ఉన్నాడు.. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఐటి శాఖ అధికారులకు ఒక చిన్న కుంటలో మొసళ్ళు(crocodiles) కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వాటిని చూసి వారు వెంటనే అప్రమత్తమయ్యారు. కేశర్వాణి ఇంట్లో విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. పని కూడా బినామీ పేర్లతో ఉన్నాయి. రవాణా శాఖ నుంచి సమాచారం సేకరించి ఆ వాహనాల వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇక ఇదే రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో రాథోడ్ మొదట్లో వ్యాపారం చేసేవారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి కోసం తీవ్రంగా కృషి చేశారు. భారీగా డబ్బు ఖర్చుపెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాథోడ్ తండ్రి హర్నాం సింగ్ రాథోడ్ గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లోనే ఆయన భారీగా డబ్బు సంపాదించారు. తన తండ్రి సంపాదించిన డబ్బు ద్వారా బీడీల వ్యాపారం చేసిన రాథోడ్.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగాడు. చివరికి ఐటీ అధికారులకు ఇలా చిక్కాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Income tax department officials searched the house of former mla hari vamsh singh rathore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com