Ram Charan and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి విజయాలను సాధించారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ప్రతి ఒక్కరు తమదైన రీతిలో ఇండస్ట్రీ కి సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడు….
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి తీసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే…ఇక ‘త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఇక రీసెంట్ గా ఇది థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక అక్కడ మంచి ఆదరణను సంపాదించుకున్న ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో దర్శనమిస్తుంది. ఈ రోజు నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ ని చూసిన చాలా మంది చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో షూట్ టైమ్ లో దాని వెనకాల ఏం జరిగింది? అనే దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టుగా అన్ని ఇందులో ప్రతి ఒక్కరినీ ఇన్వాల్వ్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఇద్దరు హీరోలు ఉండడం వల్ల ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటూ సినిమా రిలీజ్ సందర్భంగా చాలా మంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేశారు.
కానీ ఈ సినిమా చూసిన చాలామంది ఇందులో ఇద్దరికీ సమానమైన రెస్పాన్సిబులిటీస్ ఉన్నాయి. ఇద్దరు ఎంచుకున్న పాయింట్ కూడా ఒకటే అవ్వడంతో ఇద్దరు కలిసి పోరాడారు. తద్వారా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత దక్కింది అంటూ చాలామంది సినిమా మేధావులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కొమరం భీముడో అనే సాంగ్ లో ఎన్టీఆర్ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కి రామ్ చరణ్ జెలసిగా ఫీల్ అయ్యాడట. ఎన్టీయార్ చాలా ఉత్తమంగా నటించడంతో రామ్ చరణ్ కూడా దానికి ఇన్స్పైర్ అయిపోయినట్టుగా ఈ డాక్యుమెంటరీలో తెలియజేశాడు.
ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి రామ్ చరణ్ జలసి గా ఫీల్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఫ్యూచర్ లో కూడా భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగాలని కోరుకుందాం…