Taxpayer Rights India: సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో రావు రమేష్ ను ఉద్దేశించి ” మనం బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి.. బాగో లేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్” అని అల్లు అర్జున్ అంటాడు గుర్తుందా.. ఇప్పుడు ఇదే డైలాగ్ ను ఐటీ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలు పోతున్నాయని.. నరకం చూస్తున్నామని.. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వినోదం చూస్తున్నదని మండిపడుతున్నారు. కృత్రిమ మేధ వల్ల తాము రోడ్డున పడుతున్నామని.. ఇప్పటికే లక్షల ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తాము పడుతున్న బాధలపై ఓ ఐటీ ఉద్యోగి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: బుక్స్ చదువుతూ కూడా ఇంత హాట్ షోనా అమ్మడూ..?
“కృత్రిమ మేథ రాకతో ఉద్యోగాలు పోతున్నాయి. ఇదే అదునుగా కంపెనీలు అడ్డగోలుగా ఉద్యోగాలలో కోతలు విధిస్తున్నాయి. ఇది ఎంతవరకు దారి తీస్తుందో తెలియడం లేదు. ఏటి కేడు సమస్య మరింత తీవ్రంగా మారుతున్నది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కంపెనీలు సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నాయి. ఉద్యోగాన్ని కాపాడుకోవడంతోనే సరిపోతోంది. కొత్తగా నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్న ఐటీ రంగ నిపుణులు భారీగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిఫలం ఇప్పటివరకు ఆదుకోలేదు. ఉద్యోగాలు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి సమయంలో నైనా ప్రభుత్వం మేము గతంలో చెల్లించిన పన్నుల నుంచి కొంతమేర వెనక్కి ఇవ్వాలి. ఇలాంటి సమయంలో మాకు కాస్త మద్దతు ప్రకటించాలి. పన్ను చెల్లింపుదారులను కష్ట కాలంలో ఆదుకోవాలని” ఆ టెకీ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ సంచలనం గా మారింది.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ కంపెనీలు అడ్డగోలుగా కోతలు విధిస్తున్నాయి. పెద్ద పెద్ద సంస్థల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న సంస్థల వరకు ఉద్యోగుల మెడ మీద కత్తి పెడుతున్నాయి. ప్రతి త్రైమాసికంలోనూ ఉద్యోగులను బయటికి పంపిస్తున్నాయి. దీనివల్ల చాలామంది నిరుద్యోగులుగా మారిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో నియామకాలు లేకపోవడంతో ఉద్యోగం కోల్పోయిన వారికి కొలువు లభించడం లేదు. మరోవైపు ఇన్నాళ్లపాటు చాకిరి చేయించుకున్న సంస్థ ఒక్కసారిగా మెడపట్టి బయటకి గెంటేశాయి. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి భరోసా లభించాల్సి ఉందని ఐటీ రంగ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం తన వద్ద నుంచి భారీగా ఆదాయపు పన్ను వసూలు చేసిందని.. ఈ కష్టకాలంలో ఆదుకోవాలని వారు విన్నవిస్తున్నారు. అయితే ఉద్యోగాల కోత నేపథ్యంలో ఐటీ కంపెనీలను ఏమీ అనలేని దుస్థితి ప్రభుత్వాలది.
Also Read: నా స్థాయి ఏంది.. నా లెవల్ ఏందీ.. కోమటిరెడ్డన్న నువ్వు తోపు అంతే
పైగా కంపెనీలకు కూడా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటి వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం అంటూ లేకుండా పోయింది. దీంతో ఉన్నన్ని రోజులు పని చేసి.. వద్దు అని ఆదేశాలు వచ్చిన రోజు ఉద్యోగులు బయటకు వెళ్తున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. బరువెక్కిన గుండెతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగుల విషయంలో ఏ కంపెనీ కూడా ఉదారత చూపించడం లేదు. పైగా మరింత స్థాయిలో ఉద్యోగాలలో కోత విధించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి.