KVS And NVS Recruitment 2025: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల భర్తీపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో బ్యాంకు, రైల్వే, పోస్టల్ ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. సైన్యంలో ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు గడువు డిసెంబర్ 4 వరకు మాత్రమే ఉంది.
కేంద్రీయ విద్యాలయ సంఘం (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) దేశవ్యాప్తంగా 14,967 ఉపాధి అవకాశాలను ప్రకటించాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 14 నవంబర్ 2025 నుంచి డిసెంబర్ 4, 2025 రాత్రి 11:50 గంటల వరకు ఉంటుంది. ఈ అవకాశాలు ఉపాధ్యాయులు, పరిపాలనా పదవులు సహా విస్తృత శ్రేణిని కవర్ చేస్తాయి.
అందుబాటులో ఉన్న పోస్టులు
ప్రిన్సిపల్ (134), వైస్ ప్రిన్సిపల్ (58), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ– 1465), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ– 2794) వంటి బోధనా పదవులు ముఖ్యమైనవి. లైబ్రేరియన్, అసిస్టెంట్ కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్‌లు సహా నాన్–టీచింగ్ పోస్టులు 1155 ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ (495) వంటి స్పెషలైజ్డ్ రోల్స్ కూడా ఉన్నాయి.
అర్హతా వివరాలు
పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), బీ.ఎడ్, ఎం.ఎడ్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, బీటెక్, సీసెట్, బీపీఈడీ, బీఎల్‌ఉసీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు పరిధి 35–50 సంవత్సరాల మధ్య ఉంటుంది, కేటగిరీల వారీగా వయోపరమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
అధికారిక వెబ్‌సైట్లు kvsangathan.nic.in, navodaya.gov.in ద్వారా ఆన్‌లైన్ ఫారం పూర్తి చేయాలి. సీబటీ పరీక్షలు జనవరి 2026లో జరగవచ్చు. దరఖాస్తు ఫీజు కేటగిరీల వారీగా మారుతుంది.