CM Revanth Reddy: తెలంగాణలో జాతీయ పార్టీలు అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య మరో చర్చ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి గాంధీ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చ చేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలకు ఐక్యత మార్గాలు సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి ముందుకు సాగాలని డీసీసీ అధ్యక్షులకు సలహా ఇచ్చారు. ఈ సందర్భంలో దేవుళ్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. బ్రహ్మచారులకు ఒక దేవుడు.. తాగుబోతులకు వేరే తేవుళ్లు, పప్పులు తినేవారికి ఇంకో దేవుళ్లు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజలు వివిధ ఆచారాలు, ఆహార పద్ధతులు పాటిస్తూ తమ దేవతలను ఆరాధిస్తారని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలను కలుపుకుపోతుందని తెలిపారు.
బీజేపీ నేతల ఆగ్రహం…
కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ రేవంత్ వ్యాఖ్యలను హిందూ వ్యతిరేకతగా చిత్రీకరించారు. కాంగ్రెస్‌ను ముస్లిం పక్షపాత పార్టీగా ఆరోపించి, హిందూ సమాజానికి ఐక్యత పిలుపు ఇచ్చారు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రాష్ట్రంలో హిందువులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ కళ్లు బైర్లు కమ్మాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో జోగులాంబదేవి మీద ఒట్టు.. సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు.. వేములవాడ రాజన్న మీద ఒట్టు.. అంటూ హిందూ దేవుళ్లను నమ్ముకున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు దేవతలను అవమానించేలా మాట్లాడడంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
హిందూ దేవుళ్లను విమర్శించడం నేతలకు కామన్ అయింది. ఇందుకు తానేమీ అతీతుడిని కాదని సీఎం రేవంత్‌రెడ్డి నిరూపించుకున్నారు. కీలక పదవిలో ఉన్నప్పుడు ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు. విపక్షాలను విమర్శిస్తున్నట్లుగానే మతాల విషయంలో మాట్లాడితే అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇందుకు గతంలో మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో చేసిన ‘హిందుగాళ్లు.. బొందుగాళ్లు’ వ్యాఖ్యలు ఉదాహరణ.
లోకోభిన్న రుచి అని సామెత. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అందరినీ మెప్పించడం సాధ్యం కాకపోవచ్చు.
రేవంతన్న చెప్పింది కూడా ఇదే… ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి, అన్నిసార్లు ఏకాభిప్రాయం కుదరదు. మనం కొలిచే దేవీ దేవతలనే తీసుకుంటే.. ఒక్కొక్కరికి ఒక్కో దైవం పట్ల ఇష్టం ఉండొచ్చు.… pic.twitter.com/JA5IwsoQo2
— Aapanna Hastham (@AapannaHastham) December 3, 2025