Central Jobs Recruitment 2025: కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీపై దృష్టిపెట్టింది. గంలో ఏటా 2 కోట్లు ఉదో్యగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, హామీగానే మిగిలింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేదు. దీంతో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో 2029 ఎన్నికల నాటికి పుంజుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో రైలే్వ, పోస్టల్, బ్యాంకింగ్ ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గత నెలలో విడుదల చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్-C పోస్టులకు నోటిఫికేషన్ ఇచి్చంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ఒక గొప్ప అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో (జులై 18, 2025) ముగియనుంది.
Also Read: ఆధార్ కీలక అప్డేట్.. పిల్లలకు అది తప్పనిసరి!
ఉద్యోగ వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో), ఇతర గ్రూప్-C పోస్టులను వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు స్థిరత్వం, మంచి జీతం, కెరీర్ వృద్ధి అవకాశాలను అందిస్తాయి.
అర్హత, దరఖాస్తు విధానం..
– అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన అర్హత ఉండాలి.
– దరఖాస్తుదారు వయసు సాధారణంగా 18-27 సంవత్సరాలు ఉండాలి.(రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది).
– అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ (ssc.nic.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
నేడే ఆఖరు..
దరఖాస్తు గడువు శుక్రవారం(నేటితో) ముగుస్తున్నందున, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఆలస్యం కాకుండా, అవసరమైన పత్రాలను సిద్ధం చేసి, ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయండి.