Jr NTR health issue: స్టార్ హీరోలు సినిమాల్లో పాత్రల కోసం డైరెక్టర్స్ చెప్పినట్టు తమ శరీరాన్ని మలుచుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. వయస్సులో ఉన్నప్పుడు శరీరం బాగా సహకరిస్తుంది. కానీ ఒక వయస్సు దాటిన తర్వాత శరీరం మనం కోరుకున్నట్టు మారొచ్చేమో కానీ, ముఖం లో భారీ మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పరిస్థితి అలాగే తయారైంది. ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి చాలా సన్నగా కనపడాలని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి బలంగా చెప్పడం తో, ఎన్టీఆర్ అందుకు తగ్గ వర్కౌట్స్ చేసి డైరెక్టర్ కోరిన విధంగా అతి తక్కువ రోజుల్లోనే మారిపోయాడు. కానీ ముఖం లో భారీగా మార్పులు వచ్చేశాయి. నేడు ఎన్టీఆర్ తన ఇంటి వద్ద కనిపించిన ఫోటో ని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కంగుతిన్నారు.
Also Read: సినిమా ఈవెంటా..? రాజకీయ సభనా..? ఏంటిది పవన్!
ఎన్టీఆర్ ముఖం లో దేవర టైం లో ఉన్న గ్లో అసలు కనిపించడం లేదు. రీసెంట్ గా సోషల్ మీడియా లో తిరుగుతున్న ఫోటో లో ఎన్టీఆర్ బుగ్గలు లోపలకు పీక్కొని పోయినట్టు అనిపిస్తున్నాయి. ఆయన ముఖం లో ఒకప్పుడు ఉన్నటువంటి గ్లో అసలు కనిపించడం లేదు. ఎన్టీఆర్ కి ఏమైంది?, ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో ట్వీట్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ వయస్సు ఇప్పుడు 40 ఏళ్ళు దాటింది, తక్కువ సమయం లో సన్నబడేందుకు ఆయన ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా?,దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే ఇలాంటి షేప్ లో కనిపిస్తున్నాడా?. మన అందరికీ తెలిసిందే, రాఖీ సమయం లో ఎన్టీఆర్ ఎంత లావుగా కనిపించేవాడో. ఆ సినిమా సమయం లో చాలా మంది ఎన్టీఆర్ సినిమాలను అసలు చూడడమే మానేశారు. యూత్ ఆడియన్స్ , ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ ఇలా అందరికి దూరం అయ్యాడు.
Also Read: 50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల లుక్, మాధవన్ గ్లామర్ సీక్రెట్ ఇదే!
అప్పుడు రాజమౌళి యమదొంగ సినిమా చేసే ముందు, నీ లుక్స్ మార్చాలి, అసలు నిన్ను జనాలు చూడడమే మానేశారని చెప్పడం తో ఎన్టీఆర్ అప్పటికప్పుడు లైపోసక్షన్ ట్రీట్మెంట్ చేయించుకొని తన శరీర ఆకృతిని నాజూగ్గా మార్చుకున్నాడు. మళ్ళీ అదే ప్రయత్నం ఇప్పుడు కూడా చేశాడా?, అందుకే ఇంత తక్కువ సమయం లో అలా బక్క చిక్కిపోయాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఈ అంశంపై ఎన్టీఆర్ నోరు విప్పే దాకా ఎవరికీ తెలియదు. కేవలం రకరకాల రూమర్స్ మాత్రమే ప్రచారం లోకి వస్తుంటాయి. వాటిని అభిమానులు కొంతకాలం భరించక తప్పేదేమో. ఇకపోతే ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 23 న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.