Homeఉద్యోగాలుJobs: 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రేపే లాస్ట్‌ !

Jobs: 2,253 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రేపే లాస్ట్‌ !

Jobs: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పలు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నర్సింగ్‌ ఆఫీసర్స్, పర్సనల్‌ అసిస్టెంట్స్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తు గడువు మార్చి 27తో ముగియనుంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఏ పోస్టులు ఎన్ని..
యూపీఎస్సీ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నర్సింగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులు 1,930 ఉండగా, పర్సనల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు 323 ఉన్నాయి. నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ)లో ఉన్నాయి.

నర్సింగ్‌ ఆఫీసర్‌కు వీరు అర్హులు..
నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఎస్సీ(ఆనర్స్‌)నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌/పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్, స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సు లేదా మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ అయి ఉండాలి. లేదా డిప్లొమా(జనరల్‌ నిర్సింగ్‌ మిడ్‌ వైఫరీ ), స్టేట్‌ నిర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సు, మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ అయి ఉండాలి. కనీంసం 50 పడకల ఆస్పత్రిలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి..
2024, మార్చి 27 నాటికి జనరల్‌/ఈడబ్ల్యూస్‌ అభ్యర్థులకు 30, ఓబీసీ అభ్యర్థులకు 33, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35, దివ్యాంగులకు 40 ఏళ్ల వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజు..
కేవలం రూ.25 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపీక ప్రక్రియ ఇలా..
రాత పరీక్ష, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
తెలంగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలోని అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టలకు..
ఎంప్లాయ్‌మెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో 323 పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

అర్హతలు..
గుర్తింప పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు స్టెనోగ్రఫీ(ఇంగ్లిష్‌ లేదా హిందీ) నైపుణ్యం ఉండాలి.

వయసు..
కనిష్టంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం..
రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, స్కిల్‌ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version