IPL 2022 Eliminator: కొన్ని సార్లు మనం చేసే పొరపాట్లే గ్రహపాట్లు అవుతాయి. మనం చేసిన తప్పిదాలే ఇతరులకు మంచి మార్గాలుగా మారతాయి. దీంతో వారు సునాయాసంగా విజయం సాధించి మనల్ని వెనక్కి నెడతారు. సరిగ్గా బెంగుళూరు చాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్ మ్యాచ్ లో ఇదే జరిగింది. మొదటి నుంచి దూకుడుగా ఆడి ప్లేఆఫ్ కు చేరిన లక్నో ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. చేజేతులా చేసిన తప్పిదాలతో ఎదుటి జట్టుకు ప్లస్ చేసింది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ తన పంతం నెగ్గించుకుంది. అంచనాలు లేని జట్టు అందలాలు ఎక్కింది. అందరిలో ఆశలు రేపిన లక్నో జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించడం గమనార్హం.
కోల్ కతలోని ఈడెన్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో జట్టు బెంగుళూరుకు తలవంచింది. సులభంగా నెగ్గాల్సిన ఆటలో తప్పులు చేసి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. గుజరాత్ తో పాటు లక్నో కొత్త జట్లు అయినా బాగా రాణించడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లు ఫైనల్ చేరడం ఖాయమనే వాదనలు కూడా వచ్చాయి. కానీ లక్నో తన ఫైనల్ ఆశలను వమ్ము చేసుకుంది. బెంగుళూరు చేతిలో ఓటమి పాలై పోటీ నుంచి బయటపడింది. దీంతో ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కావాలనే మ్యాచ్ ఓడినట్లుగా ఉందని అభిమానులు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.
Also Read:Pawan Kalyan on Amalapuram: అది పక్కా వైసీపీ డిజైన్.. అమలాపురం విధ్వంసంపై పవన్ ఘాటైన వ్యాఖ్యలు
బెంగుళూరు బ్యాటింగులో లక్నో మంచి క్యాచులు జారవిడిచింది. మూడు చాన్సులు వదిలేసింది. ఫలితంగా తన ఫైనల్ చాన్సును వదులుకుంది. స్వయంకృతాపరాధంతో ఓటమి పాలైంది. మూడంటే మూడు క్యాచులు పడితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కానీ ఆటగాళ్లలో సమష్టి సహకారం కొరవడిందని తెలుస్తోంది. అందుకే విజయం సాధించకుండా వెనుదిరిగినట్లు చెబుతున్నారు. రాయల్ చాలెంజర్స్ కు అవకాశం ఇచ్చి తాను మాత్రం పోటీకి దూరమైంది.
దీంతో ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది. కేవలం 14 పరుగుల తేడాతో బెంగుళూరు గెలిచింది. లక్నో ఓటమి పాలైంది. రజత్ పటేదార్ అద్బుతమైన సెంచరీతో బెంగుళూరుకు విజయం సాధించి పెట్టాడు. లక్నో మాత్రం తనదైన శైలిలో కాకుండా ఏదో ఆడుతున్నట్లుగా చేసి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మొదటి సారి టోర్నీలో ప్రవేశించి తనదైన ఆటతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసినా ప్లే ఆఫ్ లో మాత్రం తన పట్టు చూపించలేదు. ఫలితంగా అపజయం సొంతం చేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురవడం తెలిసిందే. మొత్తానికి బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ ఫైనల్ చేరడం జరిగింది.
Also Read:Konaseema Tension: అమలాపురం విధ్వంసం వెనుక ఎన్నో అనుమానాలు.. వారి పనేనా?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Ipl 2022 eliminator royal challengers bangalore beat lucknow super giants
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com