Konaseema Tension: కోనసీమ విధ్వంసం వెనుక పక్కా ప్రణాళిక ఉందా? కోనసీమ జిల్లా సాధన సమితి ముసుగులో అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు కుట్రకు తెరతీశారా? పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో ఆ నేత పురమాయించిన మనుషులు ఇళ్లకు నిప్పుపెట్టి రణరంగంగా మార్చేశారా..? మంత్రి విశ్వరూప్ నివాసానికి నిప్పు పెట్టిన ఘటనలో అక్కడ కనిపిస్తున్న ఆనవాళ్లు.. గుర్తుపట్టడానికి వీల్లేనంత స్థాయిలో కాలిబూడిదైన తీరు.. చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని.. ఇందులో వైసీపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉందని బట్టబయలైంది. తమ పార్టీ కౌన్సిలర్ హస్తం ఉందని సాక్షాత్తూ మంత్రి విశ్వరూపే చెప్పడం దీనికి తార్కాణం. మంత్రి ముఖ్య అనుచరుడైన అన్యం సాయిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. వైసీపీకి చెందిన ఓ కీలక నేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది ఎక్కడైనా ఒకచోట పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అక్కడ, దాని పరిసరాల్లోనే ప్రభావం కనిపిస్తుంది.

Konaseema Tension
కానీ విశ్వరూప్ ఇంటి బయట, ప్రహారీ గేటు లోపల బైకులు బుగ్గిపాలయ్యాయి. ఆరు పోలీసు గన్లు సగానికిపైగా కాలిపోయాయి. సింహద్వారం బొగ్గయింది. హాల్లో కుర్చీలు, ఫ్యాన్లు, సీలింగ్, కిచెన్, కబోర్డులు, ఫ్రిజ్ అన్నీ బుగ్గయిపోయాయి. అయితే కింది అంతస్తులో నిప్పుబెడితే మంటల తీవ్రత పై అంతస్తులో అధికంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజ్‌ఉడ్‌తో తయారుచేసిన బెడ్‌రూం, హాలు తలుపులు కాలిపోయి బొగ్గులుగా మారాయి.. సీలింగ్ కాలిపోయి, ఫ్యాన్లు, ఏసీలకు నిప్పు ఎలా అంటుకుంటుంది.. రెండు అంతస్తుల్లోని విద్యుత్ వైరింగ్ మొత్తం ఎందుకు మసైపోతుంది..? ఇదంతా చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం తీరిగ్గా పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. పైగా 15-20 లీటర్ల పెట్రోల్ వాడి ఉంటారు. ఒక్కో చోట పోస్తూ ఇల్లు కాల్చాలంటే అక్కడ ఆందోళనకారులు కనీసం 20 నిమిషాలు గడపాలి. పైగా అది మంత్రి ఇల్లు. భద్రతా సిబ్బంది ఉంటారన్న అనుమానం కలుగుతోంది. అలాంటి ఇంట్లో పారిపోకుండా అంతసేపు గడపడం అసాధ్యం.
Also Read: Sajjala Ramakrishna Reddy: ఢిఫెన్స్ లో అధికార పార్టీ..మా వారిపై మేమెలా దాడిచేస్తామంటున్న సజ్జల
సాధ్యమేనా?
సాధారణంగా మంత్రి ఇంట భద్రత అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆందోళనకారులు పెట్రోలు బాటిళ్లు, రాడ్లతో వచ్చి.. కింద, పై అంతస్తుల్లో పెట్రోల్ పోసి నిప్పంటిస్తే భద్రతా సిబ్బంది గాల్లోకైనా కాల్పులు జరపకపోవడం సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కూడా కనీసం లాఠీచార్జి చేసే ప్రయత్నం చేయలేదు. చివరకు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి కూడా సమాచారమివ్వలేదు. దీనినిబట్టి అందరికి తెలిసే ఇంత విధ్వంసమూ జరిగిందని అర్థమవుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మంత్రి విశ్వరూప్ తాను ఇప్పుడున్న ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సుమారు రూ.5 కోట్లతో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆందోళనకారులకు తెలిసే అవకాశం లేదు. కేవలం ఆయన గురించి తెలిసిన వారికే సమాచారం ఉంటుంది. అక్కడకు వెళ్లి కేవలం నిర్మాణంలో ఉన్న ఇంటికి అడ్డంగా కట్టిన పరదాలు మాత్రమే కాల్చారు ఇప్పుడు నివాసముంటున్న ఇల్లు అద్దెది. అంతా తగులబడిపోయి.. ఎందుకూ పనికి రాకుండా మారింది.

Konaseema Tension
వేలాది మంది ఎలా వచ్చారు?
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ పిలుపిచ్చింది. అయితే ఉదయం 5 గంటల నుంచే అమలాపురం పట్టణాన్ని 405 మంది పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఊళ్లోకి వచ్చే అన్ని దారుల వద్ద చెక్‌పోస్టులు పెట్టి తనిఖీ చేశారు. గుంపులుగా ఎవరూ రాకుండా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దీంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా మూడు వేల మంది వరకు అమలాపురంలో వివిధ ప్రదేశాల్లోకి ఎలా ప్రవేశించారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ కీలకనేత అనుచరుడికి అ
వమలాపురం ఎస్పీ కార్యాలయం వెనుక ఓ అపార్ట్‌మెంట్ ఉంది. అందులో ముందురోజు రాత్రి అంటే సోమవారమే చాలా మంది వచ్చి అందులో మకాం వేసినట్లు తెలుస్తోంది. అలాగే లాడ్జీలు, హోటళ్లలో కూడా దిగారు. వీరి పేర్లేవీ రిసెప్షన్‌లో నమోదు చేయలేదు. అలాగే మంగళవారం పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో సీసాల్లో పెట్రోల్ కొన్న ఆనవాళ్లు కూడా లేవు. దీనినిబట్టి ముందుగానే పెట్రోల్, రాడ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:Congress’ One Family, One Ticket: ఒకే కుటుంబం.. ఒకే టికెట్… కాంగ్రెస్‌లో క్వాలిఫికేషన్ కష్టాలు..!!