https://oktelugu.com/

కరోనా వార్తలు రాసినందుకు మహిళా జర్నలిస్టులకు జైలు శిక్ష

కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలు రాసింనందుకు ఓ జర్నలిస్టుకు జైలు శిక్ష విధించింది చైనా ప్రభుత్వం. చైనాలోని వూహాన్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై ఝాంగ్ జాన్ రిపోర్టింగ్ చేయడంతో ఆమెపై ఎప్పటి నుంచో ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ‘విద్వేషాలు రగిలించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ’ అనే అభియోగాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. 37 ఏళ్ల న్యాయవాది, జర్నలిస్టు ఝా మే నెల నుంచి ప్రభుత్వ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 29, 2020 / 02:08 PM IST
    Follow us on

    కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలు రాసింనందుకు ఓ జర్నలిస్టుకు జైలు శిక్ష విధించింది చైనా ప్రభుత్వం. చైనాలోని వూహాన్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై ఝాంగ్ జాన్ రిపోర్టింగ్ చేయడంతో ఆమెపై ఎప్పటి నుంచో ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. దీంతో చైనా న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ‘విద్వేషాలు రగిలించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ’ అనే అభియోగాలపై ఆమెపై కేసులు నమోదయ్యాయి. 37 ఏళ్ల న్యాయవాది, జర్నలిస్టు ఝా మే నెల నుంచి ప్రభుత్వ అదుపులోనే ఉన్నారు. కొన్ని నెలల కిందట ఝాంగ్ తో పాటు మరో నలుగురు జర్నలిస్టులు అద్రుశ్యమయ్యారు. అయితే ఇద్దరు జర్నలిస్టులు విడుదలవగా ఝాంగ్ ఇప్పటికీ కనిపించడం లేదు. అయితే విచారణకు ఝాంగ్ వీల్ చైర్ లో లాబీల్లో కనిపించిందని ఝాంగ్ తరుపున న్యాయవాది వీ చాట్ యాప్ లో వెల్లడించారు. ఝాంగ్ చాలా బరువు కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.