దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఎల్‌ఐసీ పాలసీ పేరుతో పలువురు మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎల్‌ఐసీ కీలక సూచనలు చేసింది. ఎల్‌ఐసీ అధికారుల పేరు చెప్పుకొని వచ్చే కాల్స్ విషయంలో కస్టమర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్‌ఐసీ అధికారులు వ్యక్తిగతంగా కాల్స్ చేయరని సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. అరగంటలో తక్కువ వడ్డీతో రుణం తీసుకునే ఛాన్స్..?
ఫోన్ కాల్స్ ద్వారా ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించి, బోనస్ కు సంబంధించి ఎటువంటి వివరాలు తెలియజేయదని తెలిపింది. పాలసీలను కట్టడం ఆపివేయాలని ఎల్‌ఐసీ ఖాతాదారులకు ఎప్పుడూ ఫోన్లు చేసి సూచనలు చేయదని వెల్లడించింది. అధికారుల పేర్లు చెప్పి వచ్చే కాల్స్ ను ఖాతాదారులు ఎప్పుడూ నమ్మవద్దని.. మోసాల బారిన పడవద్దని పేర్కొంది. మోసపూరిత కాల్స్ వస్తే ఆ వివరాలను spuriouscalls@licindia.com కు మెయిల్ చేయాలని ఎల్‌ఐసీ సంస్థ వెల్లడించింది.
Also Read: పన్ను చెల్లింపుదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆ సర్వీసులు..!
ఎల్‌ఐసీ పాలసీకి సంబంధించి ఏవైనా వివరాలను అప్ డేట్ చేసుకోవాలంటే సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి లేదా ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా అప్ డేట్ చేసుకోవాలని ఫోన్ లో పాలసీలకు సంబంధించిన వివరాలను సైతం పంచుకోకూడదని ఎల్‌ఐసీ తెలిపింది. ఎల్‌ఐసీ పేరుతో ఎవరు కాల్ చేసినా వారితో మాట్లాడవద్దని సంస్థ తెలిపింది. పాలసీ వివరాలను చెబితే ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపింది.
మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం
అదనపు బోనస్ ఇస్తామని, పాలసీని సరండర్ చేయాలని వచ్చే కాల్స్ విషయంలో సైతం జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ తెలిపింది. అలాంటి కాల్స్ గురించి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వెల్లడించింది. బోనస్, ఇతర విషయాలను ఎల్‌ఐసీ ఫోన్ కాల్స్ ద్వారా వెల్లడించదని పేర్కొంది.