
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూ హెచ్ వో) డైరెక్టర్ జనరల్ టె డ్రోస్ అథనామ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల ఆయన కలిసిన వారిలో ఒకరికి కరోనా సోకడంతో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనా వ్యాధిని తగ్గించడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించక తప్పదన్నారు. ఆరోగ్య సంస్థలో ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కాగా సోమవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 46, 420, 940 కేసులు నమోదయ్యాయి.