
అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్ర ఎన్నికల్లో ఓ రిపబ్లికన్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ఆ అభ్యర్థి కరోనాతో మృతి చెందారు. ఈ విషయం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలోని నార్త్ డకోటాకు చెందిన డేవిడ్ అందల్ ఆ రాష్ట్ర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఈ జిల్లాలో ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే అందల్ కు 35 శాతం ఓట్లు పోలయ్యయి. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో ఆయన విజయం సాధించారు. కానీ అక్టోబర్ 5వ తేదీన ఆయన కరోనాతో మృతి చెందారు. రైతులకు ఎంతో సేవ చేయాలని డేవిడ్ తపన పడేవాడని ఆయన తల్లి విలపిస్తూ చెప్పింది. దీంతో ఆయన విజయం నార్త్ ఢకోటాలో ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.