
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇబ్రహీం పట్నం మండలంలోని జక్కంపూడిలో టిడ్కో గృహాలను బుధవారం ప్రారంభించేందుకు వెళ్లారు. ఆ సమయంలో షా బాద్ గ్రామస్థులు దేవినేని ఉమను అడ్డుకున్నారు. ఆయనతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ గ్రామస్థలు దేవినేని తమను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.