అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వస్తున్నాడు. తాను ఓడిపోలేదని, కచ్చితంగా గెలుస్తానని నమ్మబలికాడు. కాగా ప్రతీ కోర్టులో ట్రంప్ నకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. మరో వైపు ఓటమిని ఒప్పుకోవాలని ఎందరో అభ్యర్థించిన నిన్నటి వరకు గెలుపు తనదేనంటూ వైట్ హౌజ్ ను వీడలేదు. అయితే తాజాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ కు అధికార పగ్గాలు ఇచ్చేందుకు ట్రంప్ అంగీకరించారు. బైడెన్ కు పాలనాధికారాలు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు వైట్ హౌజ్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బైడెన్ గెలిచాడని ట్రంప్ మాత్రం అనడం లేదు. పరోక్షకంగా అధికార బదిలీ ప్రక్రియను అనుమతించారు.