https://oktelugu.com/

‘అంటే సుందరానికి’పై నాని హడావుడి ఎందుకు?

న్యాచురల్ స్టార్ నాని కరోనా టైంలోనూ నాలుగైదు సినిమాలు చేస్తూ బీజీగా మారాడు. నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడకపోవడంతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాని ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా? నాని 25వ మూవీగా తెరకెక్కిన ‘వి’ మూవీ ఓటీటీలో రిలీజై మిక్స్ డ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 / 10:45 AM IST
    Follow us on

    న్యాచురల్ స్టార్ నాని కరోనా టైంలోనూ నాలుగైదు సినిమాలు చేస్తూ బీజీగా మారాడు. నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడకపోవడంతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాని ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

    Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా?

    నాని 25వ మూవీగా తెరకెక్కిన ‘వి’ మూవీ ఓటీటీలో రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేపోయింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కావడం నిర్మాత దిల్ రాజుకు మాత్రం కలిసొచ్చేంది. ‘వి’ మూవీ థియేటర్లలో రిలీజైతే దిల్ రాజు భారీగా నష్టపోయే వారనే టాక్ విన్పించింది.

    ‘వి’ తర్వాత నాని ‘టక్ జగదీష్’.. ‘శ్యామ్ సింగరాయ్’.. మూవీలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే నాని ‘అంటే సుందరానికీ’ సినిమా అనౌన్స్ చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసి నాని హంగామా చేశాడు.

    Also Read: ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ రైట్స్ ఎవరికి.?

    నాని ‘టాక్ జగదీష్’ సినిమా మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ మూవీకి నాని ఫిక్సయ్యాడు. వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా ‘అంటే సుందరానికీ’ మూవీపై నానా హంగామా చేయడం ఆసక్తిని రేపుతోంది. తెలుగుదనం ఉట్టిపడే కథాంశంతో ‘అంటే సుందరానికీ’ మూవీ ఉండనుందని సమాచారం.

    నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ చేస్తున్న నిర్మాతలు తప్పుకోవడంతో ఈ మూవీ కథపై నమ్మకంతో నాని మరో నిర్మాతతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. దీంతో ‘శ్యామ్ సింగరాయ్’ కొంత ఆలస్యంగా తీసుకురానున్నాడనే టాక్ విన్పిస్తోంది. టక్ జగదీష్ తర్వాత అంటే సుందరానికీ మూవీని పట్టాలెక్కించి ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ ను నిర్మిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నాని ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్