https://oktelugu.com/

Models Went Viral: ఆ 8 మంది మోడళ్లపై అగంతకులు చేసిన పని వైరల్

Models Went Viral: దక్షిణాఫ్రికాలో మానభంగాల పర్వం కొనసాగుతోంది. రేప్ లపై అక్కడి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో నిత్యం అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. దొరికితే చాలు విడిచిపెట్టకుండా లైంగిక దాడులు చేస్తూ వారిని మానసికంగా దెబ్బతీస్తున్నారు. అత్యాచారాలపై అక్కడి మహిళలు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వాటిని నిషేధించేందుకు పెద్దగా చట్టాలు తేవడం లేదు. దీంతోనే వారికి అవకాశాలు ఇచ్చినట్లు అవుతోంది. తాజాగా జోహాన్స్ బర్గ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 30, 2022 12:49 pm
    Follow us on

    Models Went Viral: దక్షిణాఫ్రికాలో మానభంగాల పర్వం కొనసాగుతోంది. రేప్ లపై అక్కడి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో నిత్యం అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. దొరికితే చాలు విడిచిపెట్టకుండా లైంగిక దాడులు చేస్తూ వారిని మానసికంగా దెబ్బతీస్తున్నారు. అత్యాచారాలపై అక్కడి మహిళలు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వాటిని నిషేధించేందుకు పెద్దగా చట్టాలు తేవడం లేదు. దీంతోనే వారికి అవకాశాలు ఇచ్చినట్లు అవుతోంది.

    Models Went Viral

    South Africa Models Raped

    తాజాగా జోహాన్స్ బర్గ్ వేదికగా ఓ ఎనిమిది మంది మోడళ్లపై మగాళ్లు రెచ్చి పోయి రేప్ చేసిన సంఘటన సంచలనం కలిగిస్తోంది. మ్యూజిక్ వీడియో షూట్ కు వెళ్లిన మహిళలను కొంతమంది మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. తరువాత వారిపై అత్యాచారానికి తెగబడ్డారు. జోహన్స్ బర్గ్ సమీపంలోని మ్యూజిక్ వీడియో షూటింగ్ కు ఎనిమిది మంది మోడల్స్ వచ్చారు. క్రుగర్స్ డోర్స్ పట్టణంలోని శివారులో 20 మంది వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు అనుమానితులను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    వీడియో షూట్ లోకి ప్రవేశించిన దుండగులు ఆ ఎనిమిది మందిపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. మహిళలందరు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు. ఒక్కో మహిళపై పదిమంది అత్యాచారం చేయడం సంచలనం కలిగిస్తోంది. ఇంత దారుణంగా వ్యవహరించిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. వారంతా విదేశీ పౌరులుగా కనిపిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

    దేశంలో అత్యాచారాలకు కఠినమైన చట్టాలు లేకపోవడంతో మగాళ్లు రెచ్చిపోతున్నారని దీంతో ప్రతి 12 నిమిషాలకో అత్యాచార ఘటన చోటుచేసుకోవడం బాధాకరమే. మహిళలకు రక్షణ కరువైందని గగ్గోలు పెడుతున్నా పట్టించుకునేవారే లేరు. దీంతోనే నేరాలు ఎక్కువవుతున్నాయి. వీలైనంత త్వరలో వారిని గుర్తించి పట్టుకుని తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉద్యమాలు సైతం జరుగుతున్నాయి.

    Tags