అమెరికాలోని ఇల్లినాయిస్ లో శనివారం ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇల్లినాయిస్ లోని రాక్ ఫోర్డలో ఉన్న డాన్ కార్టర్ లేన్ ప్రాంతంలో జరిగిన సంఘటనతో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. అయితే కాల్పులకు కారణాలు మాత్రం తెలియలేదు. కాగా డాన్ కార్టర్ లేన్ బౌలింగ్ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా గత అక్టోబర్ లో రోచెస్టర్ లో కాల్పులు జరిగాయి. ఆ సంఘటనలో ఇద్దరు మరణించగా 14 మంది గాయపడ్డారు. ప్రపంచంలోని మొత్తం పౌరుల్లో 48శాతం మంది అమెరికన్లు తుపాకులు కలిగి ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి కాల్పులు జరపడి పరిపాటిగా మారింది.