
అజర్‌బైజాన్, ఆర్మేనియా దేశాల మధ్య యుద్ద వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. తాజగా ఆదివాంర తెల్లవారుజామున ఆర్మేనియా దేశం అజర్‌బైజాన్‌లోని గంజా నగరంపై రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో ఓ భవనంలోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని అజర్‌బైజాన్ విదేశాంగశాఖ వెల్లడించగా ఆర్మేనియా దేశం కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం సాగుతోంది. ఇటీవల శాంతి ఒప్పందంపై సంతకం చేశాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాకెట్‌దాడితో మరోసారి కలకలం రేపింది.