
చైనాలోని సినోవాక్ బయోటిక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌లో మూడో దశ ప్రయోగాలు చేపట్టారు. ఇందులో భాగంగా 9 వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి అనారోగ్యం రాలేదని బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్ పరిశోధనా కేంద్రం సావో పాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ ఒక ప్రకనటలో వెల్లడిచింది. దీంతో మూడోదశలోనూ విజయవంతమైన తొలి వ్యాక్సిన్ సంస్థగా సినోవాక్ నిలిచినట్లు పేర్కొంటున్నారు.