
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో ఎందరో మంది నిరాశ్రయులవుతున్నారు. మంగళవారం సైతం భారీ వర్షం కురువడంతో నష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళాలు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ. 550 కోట్లు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ప్రముఖులు స్పందించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని సినీ ప్రముఖులు హైదరాబాద్ పరిస్థితిని చూసి చలించిపోతున్నారు. ఈ మేరకు సినీ నటుడు అక్కినేని నాగార్జున రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.