ICMR: కరోనా కొత్త వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఐసీఎంఆర్ తెలిపింది. కానీ కనీస జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించింది. పరిస్థితిని ప్రభుత్వ విభాగాలు గమనిస్తున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. కరోనా సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.