భారత్‌చ చైనా దేశాల మధ్య కార్ప్స కమాండ్ స్థాయి చర్చలు ఈనెల 12న జరగనున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భంలో ఈ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై చర్చలు నిర్వహించనున్నారు. లడక్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల తరువాత నిత్యం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బలగాలు దించుతుండడం ఆందోళన రేకెత్తింది. దీంతో చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవచ్చని నిర్ణయించుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.