
తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా ధర్మారెడ్డి ఆదివాంర బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతం పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసింది. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌సింఘాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా పూర్తిస్థాయి ఈవోగా జవహర్‌రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యశాఖలో ఉన్న జవహర్‌రెడ్డి టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు ఇదివరకే ప్రతిపాదనలు పెట్టుకున్నారు.