https://oktelugu.com/

పాదచారులపై దూసుకెళ్లిన వ్యాన్: నలుగురు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు చిన్నారులపై డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కర్నూలు జిల్లా సరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో మంగళవారం కర్నూరు-వైఎస్సార్ కడప జిల్లా జాతీయ రహదారి40 మంది వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా వీరు వేకువ జామున ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్తున్నారు. ఈక్రమంలో ఓ డీసీఎం వ్యాన్ పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 15, 2020 / 12:32 PM IST
    Follow us on

    కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు చిన్నారులపై డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కర్నూలు జిల్లా సరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో మంగళవారం కర్నూరు-వైఎస్సార్ కడప జిల్లా జాతీయ రహదారి40 మంది వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా వీరు వేకువ జామున ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్తున్నారు. ఈక్రమంలో ఓ డీసీఎం వ్యాన్ పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత, హర్షవర్ధన్,ఝాన్సీ, వంశీ అనే చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను స్థానికులు వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా ప్రమాదానికి గురైన వారంతా ఎర్రగుంట ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.