
అమెరికా ఎన్నికల్లో మెజారీటి తగ్గడంతో అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇటీవల మిచిగన్‌పై కోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. డెమొక్రట్లు, ఎలక్షన్ అధికారులు కలిసి తనను ఓడించేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. తనను రెండోసారి అధికారంలోకి రాకుండా చేస్తున్నారని విమర్శించారు. చట్టవ్యతిరేక ఓట్లు లెక్కిస్తే విజయం తనదేనని తెలిపారు. మెయిల్ ఇన్ ఓటింగ్ పద్దతి ద్వారా బైడెన్ వర్గం భారీ మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. కీలకమైన రాష్ట్రాల్లో ఈ పద్దతి ద్వారా బైడెన్ తనకు కావాల్సిన ఓట్లు వేయించుకున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.