అమెరికా ఎన్నికల్లో ఆది నుంచి ఆధిక్యం కొనసాగిస్తున్న డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి చేరువలో ఉన్నారు. ట్రంప్ కంటే బైడెన్ 917 ఓట్లు ఎక్కువగా సాధించారు. ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. జార్జియాలో ఎలక్టరోల్ ఓట్లను భట్టి గెలుపోటమి ఉంటుంది. అయితే గెలుపు బాటలో వెళుతున్న బైడెన్‌కు భద్రత పెంచారు. అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్ పోస్టు పెట్టింది. విజయం సాధించిన వెంటనే విల్మింగ్టన్ సెంటర్ వేదికగా బైడెన్ కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన భద్రత కల్పించేందుకు సీక్రెట్ బలగాలను పెంచుతున్నట్లు తెలిపింది.