https://oktelugu.com/

టీపీసీసీపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే టీపీసీసీ నాయకత్వ మార్పు అవసరమన్నారు. దుబ్బాక ఫలితం తరువాత పరిస్థితులు ఎలా ఉన్నా నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అలాగే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారన్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌కమిటీల్లో మార్పులు ఉండవచ్చని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 6, 2020 / 03:51 PM IST
    Follow us on

    నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే టీపీసీసీ నాయకత్వ మార్పు అవసరమన్నారు. దుబ్బాక ఫలితం తరువాత పరిస్థితులు ఎలా ఉన్నా నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అలాగే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తమ రిపోర్టులు జాతీయ పార్టీకి అందిస్తారన్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌కమిటీల్లో మార్పులు ఉండవచ్చని ఆయన తెలిపారు.