కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ మేరకు రెండు రోజుల కిందట ఇజ్రాయెల్ ప్రధాని కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ టీకా తీసుకున్నారు. డెలావర్ లోని క్రిస్టియానా ఆసుపత్రిలో ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తాను టీకా వేయించుకున్నట్లు తెలిపారు. కాగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మరోవైపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉందని, అందువల్ల భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు.