https://oktelugu.com/

కొత్తరకం వైరస్ పై కరోనా టీకా పని చేస్తుందా? పరిశోధకులు ఏమంటున్నారు?

2020 సంవత్సరమంతా కరోనాతోనే గడిచిపోతోంది. కొత్త ఏడాదినలో కరోనా మహమ్మరిని తరిమేందుకు వ్యాక్సిన్ తో ప్రపంచమంతా రెడీ అవుతోంది. అయితే 2021సంవత్సరానికి ముందే కరోనా రూపాంతరం చెంది మానవాళికి పెనుసవాల్ ను విసిరింది. యూరప్ దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా వైరస్ కంటే 70శాతం వేగంగా కొత్తరకం వైరస్ విజృంభిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలను రద్దు చేసి కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. Also Read: 5000 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 22, 2020 / 09:31 AM IST
    Follow us on

    2020 సంవత్సరమంతా కరోనాతోనే గడిచిపోతోంది. కొత్త ఏడాదినలో కరోనా మహమ్మరిని తరిమేందుకు వ్యాక్సిన్ తో ప్రపంచమంతా రెడీ అవుతోంది. అయితే 2021సంవత్సరానికి ముందే కరోనా రూపాంతరం చెంది మానవాళికి పెనుసవాల్ ను విసిరింది.

    యూరప్ దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా వైరస్ కంటే 70శాతం వేగంగా కొత్తరకం వైరస్ విజృంభిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలను రద్దు చేసి కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు.

    Also Read: 5000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 500 ఇచ్చే యాప్.. కానీ..?

    యూకేలో కరోనా రూపాంతరమైన వీయూఐ-202012/01 స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో యూరప్ దేశాలకు నడిచే విమాన సర్వీసులను ఇప్పటికే పలు దేశాలు రద్దు చేసుకున్నాయి. అన్నిదేశాలు ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

    బ్రిటన్లో మాదిరిగానే దక్షిణాఫ్రికాలోనూ కొత్త వైరస్ వేరియంట్‌ను సైంటిస్టులు గుర్తించారు. ఇక్కడి నమోదవుతున్న ప్రతీ పది కేసుల్లో తొమ్మిది కొత్త స్ట్రెయిన్‌ కేసులే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    ఈ రెండు కొత్త రకాల వైరస్ లపై కరోనా వ్యాక్సిన్ ఏమేరకు పని చేస్తుందనే అనుమానాలను నివృత్తి చేసేలో పనిలో సైంటిస్టులు పడ్డారు. వైరస్ రూపాంతరం చెందడం దాని సాధారణ లక్షణాల్లో ఒకటని సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్లూ కూడా అనేకసార్లు మ్యుటేషన్ చెందిందని పేర్కొన్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 50వేల వేతనంతో ఉద్యోగాలు..?

    కరోనా వైరస్ ఇప్పటికే చాలాసార్లు మార్పు చెందిందని.. ఇకపై కూడా రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు రూపాంతరం చెందిన వైరస్‌లు టీకా ప్రభావం నుంచి తప్పించుకున్న దాఖలాలు లేవని సైంటిస్టులు చెబుతున్నారు.

    ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ చాలా నెమ్మదిగా రూపాంతరం చెందుతుందని చెబుతున్నారు. కొత్తరకం వైరస్ లపై కరోనా టీకా ఖచ్చితంగా పని చేస్తుందని అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో మాత్రం కరోనా భయాందోళనలు వీడడం లేదు.