https://oktelugu.com/

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నప్రశాంత్ నీల్

కెజిఎఫ్ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఆకాశానికి చేరుకోగా… అనేక మంది స్టార్స్ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఈ వార్తలను బలపరిచేలా… ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా ట్వీట్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఇక అధికారికమే అని అందరూ […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 09:37 AM IST
    Follow us on


    కెజిఎఫ్ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఆకాశానికి చేరుకోగా… అనేక మంది స్టార్స్ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఈ వార్తలను బలపరిచేలా… ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా ట్వీట్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఇక అధికారికమే అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ తో తన చిత్రం ఉంటుంది అన్నట్లు, ప్రశాంత్ నీల్ హింట్ ఇవ్వగా… కన్నడ ప్రేక్షకులు ఆయనను ట్రోల్ చేయడం జరిగింది.

    Also Read: అల్లరి నరేశ్ కేరీర్ లోనే భారీ పారితోషికం ఆ సినిమాకే..

    మన హీరోలు ఉండగా… ఇతర పరిశ్రమల హీరోలతో మీరు సినిమా ఎలా చేస్తారని సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేశారు. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు తమ పరిశ్రమకు చెందిన హీరోలతోనే సినిమాలు చేసి, వాళ్ళ అభివృద్ధికి దోహదం చేశారని వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఏదిఏమైనా కెజిఎఫ్ తరువాత ఎన్టీఆర్ తో ఆయన చిత్రం లాంఛనమే అని అందరూ భావించారు. అనూహ్యంగా ప్రశాంత్ నీల్… ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ తో మూవీ ప్రకటించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.

    Also Read: అఖిల్ తో భారీ రిస్క్ చేస్తున్న ప్లాప్ నిర్మాత !

    సలార్ పేరుతో భారీ పాన్ ఇండియా మూవీని ఆయన ప్రకటిచడం జరిగింది. కెజిఎఫ్ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు చెప్పడం జరిగింది. దీనితో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందా లేదా అనే సందేహం ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది. దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనను కోరుతున్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం సదరు సందేశాలకు స్పందించడం లేదు. కనీసం మైత్రి మూవీ మేకర్స్ అయినా ఈ ప్రాజెక్ట్ గురించి వివరణ ఇస్తే బాగుండు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్… ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్