అమెరికా: కోటి దాటిన కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 90 వేలకు పైగా నమోదైనా కేసులు తాజాగా లక్షా 27 వేలకు పైగా నమోదయ్యాయి. ఈమేరకు జాన్స్‌ హాష్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకటించింది. అయితే వరుసగా మూడోరోజు అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో వైరస్‌ కేసుల సంఖ్య కోటి నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,36000 మంది మరణించారు. వైరస్‌ కేసులు, మరణాల సంఖ్యలో మిడ్‌వెస్ట్రన్‌, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, ఐఓవా, విస్కిసన్‌ రాష్ట్రాలు హాట్‌స్పాట్లుగా మారాయి. […]

Written By: Suresh, Updated On : November 7, 2020 11:28 am
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 90 వేలకు పైగా నమోదైనా కేసులు తాజాగా లక్షా 27 వేలకు పైగా నమోదయ్యాయి. ఈమేరకు జాన్స్‌ హాష్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకటించింది. అయితే వరుసగా మూడోరోజు అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో వైరస్‌ కేసుల సంఖ్య కోటి నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2,36000 మంది మరణించారు. వైరస్‌ కేసులు, మరణాల సంఖ్యలో మిడ్‌వెస్ట్రన్‌, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, ఐఓవా, విస్కిసన్‌ రాష్ట్రాలు హాట్‌స్పాట్లుగా మారాయి. టక్సాస్‌ రాష్ట్రంలో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. అయితే వైట్‌హౌజ్‌ చీఫ్‌ ఆఫ్‌స్టాఫ్‌ మార్క్‌ మిడోస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.