https://oktelugu.com/

గెలుపు లాంఛనమే: వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బైడెన్‌..!

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అమెరికా ఎన్నికలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. మరోసారి ట్రంప్‌ గెలుస్తాడా..? లేక బైడెన్‌ వైట్‌ హౌస్‌లోకి అడుగు పెడుతాడా..? ఇంకా సస్పెన్స్‌ వీడడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.. మూడు రోజులుగా జరుగుతున్న కౌంటింగ్‌లో బైడెన్‌ మొదటి నుంచీ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాడు. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు డొనాల్డ్ ట్రంప్ కన్నా బైడెన్  చాలా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. కోర్టు పేరు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 11:36 AM IST
    Follow us on

    గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అమెరికా ఎన్నికలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. మరోసారి ట్రంప్‌ గెలుస్తాడా..? లేక బైడెన్‌ వైట్‌ హౌస్‌లోకి అడుగు పెడుతాడా..? ఇంకా సస్పెన్స్‌ వీడడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలను వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.. మూడు రోజులుగా జరుగుతున్న కౌంటింగ్‌లో బైడెన్‌ మొదటి నుంచీ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాడు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    డొనాల్డ్ ట్రంప్ కన్నా బైడెన్  చాలా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. కోర్టు పేరు చెబుతూ ట్రంప్‌ అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీంతో తాను విజయానికి దగ్గరలోనే ఉన్నానని రెండు రోజులుగా చెబుతూ వస్తున్నారు. తను 253 ఎలక్టోరల్ ఓట్లు సాధించినట్టు బైడెన్ ప్రకటించారు., పెన్సిల్వేనియాలో మరో 20 ఓట్లు పడితే ఇక ఆయన వైట్ హౌస్‌కు దారి చూసుకోవచ్ఛు .

    Also Read: అమెరికాలో నవంబర్‌లోనే ఎన్నికలు ఎందుకు..? 1845కు ముందు ఏం జరిగింది..?

    మరోవైపు జార్జియా, ఆరిజోనా, నెవాడా రాష్ట్రాల్లో ట్రంప్ కన్నా జో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. జార్జియా ఓట్లకు సంబంధించి లెక్కింపు తుదిదశకు చేరుకోవాలంటే ఈ నెల 20 వరకు ఆగాల్సిందేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం రాత్రి బైడెన్ తన విజయోత్సవ ప్రసంగం చేయాలనుకున్నారు. కానీ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. దేశవ్యాప్తంగా ట్రంప్ కన్నా ఆయన 4.1 మిలియన్ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    Also Read: ట్రంప్ ఓటమికి.. మోడీకి లింకెంటీ?

    కొన్ని స్టేట్స్‌లో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా పోరు సాగినా.. బైడెన్‌ ఒక్కో స్టేట్‌లో గెలుస్తూ వచ్చాడు. అమెరికా హిస్టరీలోనే అత్యధిక ఓట్లు గెలుచుకున్నాడు. మ్యాజిక్‌ ఫిగర్‌‌కు చేరువయ్యాడు. ఇదిలా ఉండగా.. కరోనా వల్ల ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు కూడా వెల్లువెత్తాయి. సమయం ముగిసిన తర్వాత కూడా వేసిన ఓట్లను కౌంట్‌ చేస్తున్నారంటూ ట్రంప్‌ మండిపడుతున్నాడు. కౌంటింగ్‌ ఆపాలంటూ కోర్టులకెక్కాడు. అయినా ట్రంప్‌ పరిస్థితి తారుమారైంది. ఒక్క స్టేట్‌లో గెలిచినా బైడెన్‌ అధ్యక్షుడు కావడం ఖాయమైంది.