రోడ్‌సైడ్‌ బాంబ్‌ పేలుడు: ముగ్గురు పోలీసులు మృతి

అప్ఘనిస్తాన్‌లో వరుస పేలుళ్లతో దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల కిందట కాబూల్‌ యూనివర్సిటీలో ఉగ్రదాడిలో భాగంగా పేలుళ్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. తాజాగా దక్షిణ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుళ్లలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ప్రావిన్స్‌ పరిధిలోని కందహార్‌ రోడ్‌సైడ్‌ బాంబును పోలీసు వాహనం ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నరన్నా దానిపై ఉగ్రవాదులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు […]

Written By: Suresh, Updated On : November 6, 2020 3:23 pm
Follow us on

అప్ఘనిస్తాన్‌లో వరుస పేలుళ్లతో దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల కిందట కాబూల్‌ యూనివర్సిటీలో ఉగ్రదాడిలో భాగంగా పేలుళ్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. తాజాగా దక్షిణ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుళ్లలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ప్రావిన్స్‌ పరిధిలోని కందహార్‌ రోడ్‌సైడ్‌ బాంబును పోలీసు వాహనం ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నరన్నా దానిపై ఉగ్రవాదులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాజకీయ పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం, ఉగ్రవాదులతో చర్చలు జరుగుతున్నాయి. ఇటు చర్చలు జరుగుతుండగానే అటు పేలుళ్లు జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.