
ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన నేపాల్ లో జరిగింది. దార్చల్లా జిల్లా గన్నా నుంచి మహేంద్రనగర్ వెళ్తున్న ఓ బస్సు దశరథ్ చంద్ రహదారిపై అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు యజమానే డ్రైవింగ్ చేశాడని, మూలమలుపును అదుపు చేయకపోవడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు.