
ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్నచైనాలో మరో విషాదం నెలకొంది. తాజాగా ఈశాన్య చైనాలోని బొగ్గుగనిలో చిక్కుకొని 18 మంది కార్మికులు మరణించారు. చాంగ్ కింగ్ లోని డయాషుయిడాంగ్ బొగ్గుగనిలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు చైనాకు చెందిన వార్తా సంస్థ జిన్ హువా వెల్లడించింది. బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధిక స్థాయిలో ఉండడంతో అందులో చిక్కుకున్న 18 మంది మృతి చెందారు. అయితే సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. కాగా ఒకరిని కాడారు. గత సెప్టెంబర్ లో సాంగ్ జావో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. అయితే భూగర్భ గనుల్లో సరైన పరికరాలు అందుబాటులో ఉంచకపోవడంతో ఈ గనిపై రెండు నెలలపాటు ప్రభుత్వం నిషేధం విధించింది.