https://oktelugu.com/

పొరపాటును సరిద్దిదుకొని.. ప్రభాస్ కు విషెస్ చెప్పిన మహేష్..!

నేడు యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ 41వ జన్మదినం. కొద్దిరోజుల ముందు నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ బర్త్ డేను సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ట్రెండింగులోకి తీసుకొచ్చారు. ప్రభాస్ సీడీపీనిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంగతి తెల్సిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. Also Read: పాన్ ఇండియా పఠాన్.. సాహో.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు పలువురు సినీ, […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 02:46 PM IST
    Follow us on

    నేడు యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ 41వ జన్మదినం. కొద్దిరోజుల ముందు నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ బర్త్ డేను సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో ట్రెండింగులోకి తీసుకొచ్చారు. ప్రభాస్ సీడీపీనిని సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంగతి తెల్సిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

    Also Read: పాన్ ఇండియా పఠాన్.. సాహో.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్

    ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు యంగ్ రెబల్ స్టార్ కు పెద్దఎత్తున విషెస్ చెబుతున్నారు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘మీకు అనంతమైన విజయం.. ఆనందం.. అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను..’ అంటూ మహేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. ‘అర్జున్’ సినిమా ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఫొటోను మహేష్ షేర్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    అయితే మహేష్ ఓ చిన్నపొరపాటు చేసినట్లు గుర్తించి వెంటనే సరి చేస్తూ మరొక ట్వీట్ చేశాడు. మహేష్ తొలిసారి ట్వీట్ చేసినప్పుడు ప్రభాస్ ఐడికి బదులుగా వేరొకరి ఫేక్ అకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే వేరొకరి పేరును చూపిస్తోంది. దీంతో కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న మహేష్ ఆ ట్యాగ్ ను తీసేశాడు. నిజానికి ప్రభాస్ కు ట్వీటర్ అకౌంట్ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

    మహేష్ బాబు ఎప్పటిలాగే స్టార్ హీరోలందరికీ సన్నిహితంగా ఉంటాడని మరోసారి రుజువు చేశాడు. ఎన్టీఆర్.. రాంచరణ్.. పవన్ కల్యాణ్ బర్త్ డేల సందర్భంగా విషెస్ చెబుతూ అభిమానులను మహేష్ ఆకట్టుకుంటున్నారు. మహేష్ చేసే ట్వీట్స్ చాలా స్పెషల్ గా ఉంటూ వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి ప్రభాస్ కు విషెస్ అందించి మహేస్ స్నేహశీలి అని చాటుకున్నాడు.

    Also Read: మోనాల్ ను కాపాడుతున్న ‘బిగ్ బాస్’.. ఈవారం ఎలిమినేషన్ ఉండదా?

    ఇక మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారిపాట’లో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు ప్రభాస్ సైతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. దీంతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీ.. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించబోతున్నాడు. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కన్పించబోతుండటంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    https://twitter.com/urstrulyMahesh/status/1319510107189895168?s=20