Zubeen Garg Case: మన దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పుట్టి.. ప్రపంచ స్థాయి గాయకుడిగా ఎదిగాడు జుబిన్ గార్గ్(Zubeen Garg). తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే గత ఏడాది గార్గ్ సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు . అతని మరణం మనదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
గార్గ్ మరణించిన నేపథ్యంలో.. అతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగపూర్ ప్రాంతంలో అతడు చనిపోయిన నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే గార్గ్ చనిపోవడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయని అతని భార్య మీడియాకు వెల్లడించింది. దీంతో ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు ఊహించిన విధంగా మలుపు తిరిగింది. గార్గ్ ది హత్య కాదని.. అతడి మరణం వెనుక ఎటువంటి అనుమానాలు లేవని.. అతడు సహజ మరణం వల్లే కన్నుమూశాడని పోలీసులు పేర్కొన్నారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. ఫలితంగా గార్గ్ చనిపోయాడని పోలీసులు వెల్లడించారు…
గత ఎడాది జుబిన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ వెళ్ళాడు. ఆ పర్యటనలో భాగంగా ఈ యాట్ పార్టీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు. దానికంటే ముందు ఒకరోజు ఈతకొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. గార్గ్ ది సహజమరణం కాదని.. ఎవరో అతడిని అంతం చేసి ఉంటారని అతని భార్య నుంచి మొదలుపెడితే, చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసం పోలీసులు మనదేశంలో చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి సింగపూర్ పోలీసుల సైతం ఈ కేసును విచారించడం మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులకు దర్యాప్తు పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు తుది నివేదికను కరోనార్ కోర్టుకు అందించారు.
” ఆ పార్టీకి ముందు గార్గ్ ఈతకు వెళ్ళాడు. అయితే అతడు లైఫ్ జాకెట్ ధరించలేదు. అందువల్ల నీటిలో ఈత కొడుతూ చనిపోయాడు. అతడు గనుక లైఫ్ జాకెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కించుకునే వాడని.. రెండుసార్లు నిర్వాహకులు లైఫ్ జాకెట్ ఇస్తామని చెప్పినప్పటికీ గార్గ్ నిరాకరించాడని” సింగపూర్ పోలీసులు వెల్లడించారు.